డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి, కూర్మాపురం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రమేష్ కుమార్ రైతులతో కొన్ని విషయాలను చర్చించారు,వరిలో ఎండుఆకు తెగులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని రైతులు వ్యవసాయ అధికారికి తెలుపగా, వరి పంటలో ఎండుఆకు తెగులు సూచనలు కనిపించినప్పుడు యూరియా వాడకం తగ్గించాలని, ఎకరానికి 1కేజి చొప్పున సూడోమోనాస్ పిచికారీ చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని సూచించారు, కార్యక్రమంలో ఎక్కువమంది కౌలు రైతులు పాల్గొనగా, సొంత భూమిలేని రైతులు కౌలు రైతు కార్డు పొంది పంట నమోదు చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం వర్తించే అవకాశం ఉందన్నారు,పంట భీమా పథకం కోసం భూమి ఉన్న గ్రామంలో రైతు సేవా కేంద్రంను సంప్రదించి పంట ధృవీకరణ పత్రం పొందాలని తద్వారా పంట రుణం తీసుకోని రైతుల పొలం విస్తీర్ణం మొత్తం పంట భీమా చేసుకోవచ్చు అని, పంట రుణం తీసుకున్న రైతులకు పంట ధృవీకరణ పత్రం ప్రస్తుతం అవసరం లేదని తెలిపారు. వేసవిలో అదనపు పంటగా అపరాల ను సాగుచేసిన రైతులు మాట్లాడుతూ ,మిశ్రమ విత్తనాలు (పి.ఎమ్.డి.ఎస్ కిట్లు) వేసవిలో సాగు చేసిన తరువాత రసాయన ఎరువుల వాడకం తగ్గిందని, రైతు కడలి వీర్రాజు వ్యవసాయ అధికారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో పసలపూడి రైతులు నల్లమిల్లి ఆదిరెడ్డి, మల్లిడి అమర్నాథ్ రెడ్డి, కూర్మాపురం టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు మతుకుమిల్లి భాస్కరరావు గ్రామ నాయకులు ముత్యాల చిన్నబ్బు, ఇతర రైతులు పాల్గొన్నారు.