28 October 2025
Tuesday, October 28, 2025

పసివారిపై ప్రైవేటు పాఠశాలల జులుం , చోద్యం చూస్తున్న అధికార గణం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విద్యా హక్కు చట్టానికి తూట్లు..కక్కలేక మింగలేక తల్లిదండ్రుల పాట్లు

అధిక ఫీజు పై తల్లిదండ్రులు చేసిన పోరాటమే, వారి పిల్లల పాలిట శాపం

అధికారుల అండతోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పెట్రేగిపోతున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ

విశ్వం వాయిస్ కథనంతో, తల్లిదండ్రులపై కక్ష కట్టిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

విద్యాహక్కు చట్టం 12 (1)సి ప్రకారం ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్ పాఠశాలలు పాటించాలని పదేపదే చెబుతున్నప్పటికీ, పలుచోట్ల ఆ మాటలు కేవలం కాగితాల మీద అక్షరాల గానో,లేక నోటి మాటగానో ఆగిపోతున్నాయి, కాని అమలుకు నోచుకోవడం లేదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలు మితిమీరిపోయి ఇబ్బంది పడుతున్నామని, అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కారణానికి, అభం శుభం తెలియని పసివారి ని సైతం వేధించడాని కి వెనకాడని పరిస్థితి దాపురించింది. అధికారుల చేతకానితనమో, లేక  ప్రైవేటు యాజమాన్యాల కాసుల మహిమో, కారణం ఏదైనా  పసివారి ని వేధించి, హీనంగా చూస్తూ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ కుటిలత్వాన్ని  బయట పెట్టుకుంటున్నాయి, విద్యాహక్కు చట్టం ప్రకారం ఫ్రీ సీటు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు “యాక్టివిటీ ఫీజుల పేరుతో ప్రైవేటు పాఠశాలల దందా” అనే ప్రత్యేక కథనం విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక ద్వారా ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే, కాగా ఆ కథనంలో ప్రభుత్వం ద్వారా ఫ్రీ సీటు పొందిన విద్యార్థుల, తల్లిదండ్రుల నుండి రసీదులు ఇవ్వకుండా యాక్టివిటీ పేరుతో ఫీజులు వసూలు చేస్తూ, ఆ ఫీజులు చెల్లిస్తేనే కానీ పాఠ్య పుస్తకాలు ఇవ్వమని వేధిస్తూ, విద్య హక్కు చట్టం రద్దు అయితే ఆ ఫీజు మొత్తం తల్లితండ్రులే చెల్లించాలని కాగితాలపై సంతకాలు చేయించుకున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల పై  మండల విద్యాశాఖాధికారి కి ఫిర్యాదు చేయడంతో, కక్ష సాధింపు చర్యలు చేపట్టిన ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను గుర్తుంచుకుని, వారి పిల్లలను వేధిస్తూ, ఇబ్బందికి గురి చేయడంతో, ఆవేదనకు లోనైన తల్లిదండ్రులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ దృష్టికి తమ ఆవేదనను, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుగా చేశారు, ఆ ఫిర్యాదులో తమ పిల్లలు ఎదుర్కొంటున్న వివక్షను వివరిస్తూ, ఫీజులు కట్టలేని వారికి కార్పొరేట్ స్కూల్స్ ఎందుకని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోమని చులకన చేసి మాట్లాడారని, ముఖ్యంగా ఫీజుల విషయమై ఫిర్యాదు చేయనంత వరకు సాయంత్రం 5 గంటల వరకు, పాఠశాలలోనే పిల్లలను ఉంచేవారని, అధిక ఫీజులపై అధికారులకు ఫిర్యాదు చేసిన తరువాతి నుండి మధ్యాహ్నం 2:30 గంటలకే ఫ్రీ సీట్ పొందిన విద్యార్థులను తీసుకుని వెళ్ళి పొమ్మంటున్నారని, తరగతిలో ఉన్న మిగిలిన విద్యార్థులకు మా పిల్లలకు ఎందుకు ఈ తేడా చూపిస్తున్నారని ప్రశ్నించగా వారు ఫీజులు కట్టే వారిని, మీరు గవర్నమెంట్ విద్యార్థులని తల్లిదండ్రుల ఎదుటే నిస్సిగ్గుగా మాట్లాడడంతో ఆశ్చర్యపోయామన్నారు, అంతేకాక సాటి విద్యార్థులతో కాక, పాఠశాల ముగిసిన అనంతరం మా పిల్లలను బాత్రూం ముందు వరండాలో కటిక నేలపై కూర్చోబెట్టారని, పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్లడానికి పాఠశాలకు వెళ్ళగా, ఆ పాఠశాలలోని నేలమీద పిల్లలు దీనంగా కూర్చున్న సన్నివేశం చూసి హృదయం ద్రవించి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, ఎందుకు ఈ వివక్ష అని అడిగితే ఫ్రీ సీటు అలానే ఉంటుందని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారన్నారు, ఏ విధము చేతనైనా ఆ పాఠశాలల నుండి మా పిల్లలను మాన్పించి వేయాలని , మరొక స్కూల్లో ఫ్రీ సీటు అందక మేము ఇబ్బంది పడాలి. అనేది వారి పన్నాగమని ఫిర్యాదులో తెలిపారు. కాగా ప్రభుత్వ నిబంధనలను పాటించక ఇష్టారాజ్యంగా పాఠశాలలను నడుపుతూ ” నీకు దిక్కున్న చోట చెప్పుకో అనేట్టుగా ” కావాలంటే అధికారులతో చెప్పుకో అంటూ ప్రైవేటు యాజమాన్యం మాట్లాడుతుందంటే , వారి వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఉందనేది తల్లిదండ్రుల ఆరోపణ. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇంతగా వేధిస్తూ  పెట్రేగి పోతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారంటే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాల లతో ఇలా చేయిస్తుందా? అనే అనుమానం తల్లిదండ్రుల్లో కలిగి విద్యాహక్కు చట్టం ఉచిత విద్య, వంటి అంశాలపై మాకు నమ్మకం పోతుందని ఆవేదనతో స్థానిక విలేకరులకు విషయం తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo