మండపేటను రాజమహేంద్రవరం లో కలపాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వేగుళ్ల…
వేగుళ్ల ఇంట సందడి చేసిన వేగుళ్ళ…
మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కలపడం తో ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు వైసిపి సీనియర్ నేత, జేఏసీ సభ్యులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి అన్నారు. శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ స్వగృహంలో వేగుళ్ళ ను కలిసి అభినందించారు. పలువురు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి కి చేరుకుని ఆయన్ను పూలమాలలు, దుస్సాలవాలతో అభినందనల వెల్లువ కురిపించారు.మండపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఎమ్మెల్యే వేగుళ్ళ నివాసానికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు. కేవలం వేగుళ్ళ కృషి తోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని పట్టాభి పేర్కొన్నారు. వార్డుల కౌన్సిలర్ లు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే వేగుళ్లకు అభినందనలు తెలిపారు. పూల దండలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. 2 లక్షల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం,మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ళ నారయ్య బాబు, పిల్లి గణేష్, శేషపల్లి రాజు, సిరంగి ఈశ్వరావు,పలు వార్డుల కౌన్సిలర్ లు కాసిన కాశీ విశ్వనాథ్, సిరంగు జ్యోతి, గుండు రామ తులసి,బొక్కా సరస్వతి, మాలసాల సీతామహాలక్ష్మి, సవరపు సతీష్, చుండ్రు సుబ్బారావు చౌదరి, చింతలపూడి సత్తిబాబు, యారామటి గంగరాజు, కాళ్ళకూరి శ్రీనివాస్, చిట్టూరి సతీష్, గుండు తాతరాజు, గ్రంధి శ్రీనివాస్, కొవ్వాడా అప్పంనబాబు, సొసైటీ అధ్యక్షులు కుక్కల రామారావు,కూటమి నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

