డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులతో వాహనదారులు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాత్రివేళ అయితే ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉండటంతో వాహనదారుల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉండే అమలాపురం గడియార స్తంభం, ముమ్మిడివరం నుంచి నల్ల వంతెన కి వెళ్లే రహదారి అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం, హై స్కూల్ సెంటర్ల వద్ద పశువుల సంచారం ఎక్కువగా ఉంటుందని పట్టణ మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నాను