సుపరిపాలన తొలి అడుగు లో మాజీ చైర్మన్ చుండ్రు ప్రకాష్….
పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం పాటుపడేది టిడిపి ప్రభుత్వమని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట మూడో వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. రాబోవు రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వార్డులో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ విభాగం టౌన్ వాకచర్ల వీ ఎస్ సత్యనారాయణ (గుప్తా), టిడిపి పార్లమెంట్ వాణిజ విభాగ కార్యదర్శి కేశవరపు శ్రీనివాసరావు, కౌన్సిలర్ చిట్టూరి సతీషు, పట్టణటిడిపి మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ కౌన్సిలర్ బండి గోవిందు, కుమార్, క్లస్టర్ ఇంచార్జ బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.