కేశవరం లో సుపరిపాలన తొలి అడుగు….
రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం రాజీపడని నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కొనియాడారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో బుధవారం మండపేట మండలం కేశవరం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ప్రతి ఇంటికి పర్యటించారు. ప్రజలను నేరుగా కలుస్తూ రాష్ట్రంలో పాలన విధానంపై ప్రజలకు వివరించారు వారి వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.