పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు
కాకినాడ జిల్లా ఎస్పీజి బిందు మాధవ్ ఐపీఎస్ కు అందిన సమాచారం మేరకుఎస్పీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కోరింగ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బందితో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 27600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు సుంకరపాలెం ఇంజరం తాళ్ళరేవుయానాం పరిసర ప్రాంతాలకు చెందినవారు. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆర్ఆర్ ఇన్ హోటల్ పై కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ దాడి చేయగాహోటల్ ను లీజుకు తీసుకుని సదరు హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎస్సై గుర్తించారు. హోటల్ లోని రూమ్ నెంబర్ 4 లో చింతలపూడి హర్ష నాగ వర్ధన్ అనే వ్యకి ఆధ్వర్యంలో నంది కోళ్ల శ్రీనివాసరావు, మందపల్లి ప్రసాద్, చింతాకులు దుర్గాప్రసాద్, మామిడిశెట్టి ఏసుబాబు, పువ్వల ప్రదీప్ కుమార్, పలివెల రాములు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరంతా డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్నందున ఎస్ఐ వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 27,600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, 104 పేక ముక్కలను స్వాధీనపరచుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఘోరంగా ఎస్సై పి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడైనా,ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, వ్యభిచారం తదితర నేరాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు.