8 మందిపై కేసు నమోదు…
మండపేట మండలం లోని ఏడిదలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న కొందరు వ్యక్తులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ కు అందిన సమాచారం మేరకు ఎస్సై వీ కిషోర్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. గ్రామ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై కిషోర్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.7,800 నగదు, 104 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.