డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో గల హోల్ సేల్ ఫైర్ వర్క్స్ షాపులలో ట్రైనీ అడిషనల్ డిఎస్పి ప్రదీప్తి, రాయవరం ఎస్సై సురేష్ బాబు తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫైర్ వర్క్స్ తయారీ, కార్మికుల పట్ల యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు, లైసెన్స్ వంటి పత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించి, భవిష్యత్తులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఫైర్ వర్క్స్ షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రదీప్తి వెంట ఎస్సై సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

