19వ తేది వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరానికి చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు 2025 లను అందించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా తెలిపారు. ఇద్దరు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లు జి.వి.వి. ప్రసాద్ (సాక్షి), ఎస్.బి.రాజేశ్వరరావు(ఆంధ్ర జ్యోతి) లను ఎంపిక చేశామని, మంగళవారం ప్రముఖులచే విశిష్ట పురస్కారాలను అందించనున్నామని తెలిపారు. క్లిష్టమైన సామాజిక, పర్యావరణ, సాంసృతిక మరియు ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా సమాజంలో మార్పును తేవడానికి కృషి చేస్తున్నాందుకు ఈ పురస్కారాలను అందిస్తున్నామని అద్దంకి రాజా యోనా తెలిపారు.