అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌కు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడం పట్ల మండపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పెద్ద కాలువ వంతెన వద్ద గల పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ట్రస్ట్ స్థల కేటాయింపునకు కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు . జిల్లా, మండల ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల వీర వెంకట ప్రసాద్, పీఆర్‌ఓ నాళం కిట్టు, వాసవి సేవా చైర్మన్ కేశవరపు శ్రీనివాసరావు, సోషల్ మీడియా చైర్మన్ మద్దుల సుబ్బారావు, మండపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కాళ్లకూరి శ్రీనివాస్, గాది శ్యామల రావు, పట్నాల సురేష్, బోనగిరి బాబ్జి, బలబద్రపు రాజు, కంచర్ల రాజు, వాకచర్ల వీరభద్రరావు, వెత్స సుబ్బారావు, గ్రంధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.