పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం
పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్
రామచంద్రపురం పట్టణంలో స్థానిక శివాలయం వీధిలో వున్న పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.స్థానిక జనసేన పార్టీ ఆఫీస్ నుండి శివాలయం విధి వరుకు భారీ ర్వాలీ గా సొసైటీ కి చేరుకున్నారు. అనంతరం చైర్మన్ గా పిల్లా సత్యనారాయణ ఫణి, సభ్యులు గా పోలిశెట్టి వెంకటరమణ,ముమ్మారెడ్డి పద్మశ్రీ నియమితులు అయ్యారు.ఈ సందర్బంగా చైర్మన్ ఫణి మాట్లాడుతూ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అలానే కమిటీ నిర్ణయం వెనుక మంత్రి సుభాష్ మరియు సత్యం,చంద్రశేఖర్ సహాయసాకారాలు ఉన్నాయన్నారు.అలానే సొసైటీ సభ్యులు నిర్ణయంతోనే నాకు ఈ చైర్మన్ బాధ్యత వచ్చిందని అన్నారు. సొసైటీ విషయంలో ఎటువంటి వివాదాలుకు తావు లేకుండా సామాన్య నిర్ణయాలుతో ముందుకు వెళ్తానన్నారు.ఎల్ సందర్బంగా నా స్నేహితులుకు, అభిమానులుకు,కూటమి కార్యకర్తలుకు ధన్యవాదములు తెలిపారు.అనంతరం ఘనంగా ముగ్గురుని సత్కరించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.