14 October 2025
Tuesday, October 14, 2025

పితాని ఖబర్దార్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను విమర్శించే స్థాయి పితాని బాలకృష్ణ కు లేదని అమలాపురం శెట్టిబలిజ సంఘ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న యువ నాయకుడు మంత్రి సుభాష్ ను విమర్శించే స్థాయా నీది..? అంటూ ప్రశ్నించారు. మంత్రి సుభాష్ శెట్టిబలిజ కులానికి, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేద విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వార్థం లేని సేవకుడిగా పేరొంది పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. అలాంటి మానవత్వం,మంచి తనం, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అసభ్యకర పదాలు ప్రయోగిస్తే సహించలేదు అంటూ హెచ్చరించారు 30 వ వార్డు శెట్టిబలిజ సంగీయులు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత కబాబ్దర్ పితాని బాలకృష్ణ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం అయితే తగిన విధంగా బుద్ధి చెబుతామని వాసంశెట్టి జగదీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు శెట్టిబలిజ సంఘం నాయకులు, మంత్రి సుభాష్ అభిమానులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo