డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో పెళ్లిళ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానములో పనిచేస్తున్న ముగ్గురు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆలయ ఈవో యర్ర వెంకటేశ్వరరావు శుక్రవారం విధుల నుంచి తొలగించారు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న దేవి, సుబ్బలక్ష్మి, నాగేంద్ర అన్యమతస్తులగా గుర్తించి వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు దేవాదాయ శాఖ అధికారులకు చేరడంతో వీరిని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు ఈవో ఆదేశాలు జారీ చేశారు