ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి పటిష్టమైన చర్యలు గైకొనా లని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎంపీడీవోలను నియోజకవర్గం ప్రత్యేక అధికారులను తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి 22 మండలాల ఎంపీడీవోలు తాసిల్దార్లు మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ భారీ వర్షాలు వరదలను ఎదుర్కొనేం దుకు సన్నద్ధత చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ శనివారం బ్యాంకుల నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్మును విత్డ్రా చేస్తూ శనివారం రాత్రి నుం డి సోమవారం ఉదయం వరకు ఫీల్డ్ ఫంక్షనరీస్ మీద నమ్మకంతో నిధులు భద్రప రుస్తూ సోమవారం ఉద యాన్నే యధావిధిగా గత మాసంలో ఏ విధంగా అందరికీ సామా జిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారో వారందరికీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయా లని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ల పునః విచారణ చేయాలని సూచించిందని అయితే ఆ ప్రకారం జిల్లాలో సుమారు 32 వేల మంది దివ్యాంగులు 13 శాతం ఉన్నారని వీరికి ప్రస్తుతం మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు అందు తాయని ఆయన స్పష్టం చేశారు. జిల్లావ్యా ప్తంగా సుమారు 27 క్యాటగి రీలలో రూ 101 కోట్లు సం బంధిత ప్రజాప్రతినిధుల అందుబాటుకు అనుగుణంగా వారి సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దివ్యాం గులకు పింఛన్ల పంపిణీలో కోత విధించారనే ఫిర్యా దులు రాకుండా చూడాలని అధి కారులు సూచించారు. గోదావరి నదికి మరలా వరదలు ఉదృతమయ్యే అవకాశం ఉందని రేపటికి ధవలేశ్వరం వద్ద మొదటి హెచ్చరిక వెలువడే అవకాశం ఉన్నదని ఈ నెల 31 సాయం త్రానికి రెండో హెచ్చ రిక వేలువడే అవకాశాలు ఉన్నాయన్నారు. గత పది రోజులలో వరదలు భారీ వర్షాల పట్ల ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అదే స్థాయిలో మరల సన్నద్ధత చర్యలను చేపడుతూ అప్రమత్తంగా వ్యవహరిం చాలని ఆదేశించారు. వరద హెచ్చరికలకు అనుగుణం గా లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆస్తి ప్రాణ నష్టాలకు ఆస్కారం లేకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ముoపు లోతట్టు ప్రాంతా లలో రోడ్లు క్రాసింగ్ వద్ద బోట్లు ఏర్పాటు చేయాల న్నారు. సెప్టెంబరు మూడు నాలుగు తేదీలలో వినా యక నిమజ్జనం కార్యక్ర మాలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీలు ముం దుగా సూచించిన నిమజ్జన ప్రాంతాలలో ఉత్సవ విగ్రహాలను బట్టి క్రేన్లు , ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా వ్యవ హరించాలని సూచించారు వినాయక నిమజ్జన కార్యక్ర మాలు వరదలు ప్రవాహం ఎక్కువగా ఉన్న దృష్ట్యా మరింత జాగరూకతతో నిమజ్జన ఘట్టాల వద్ద వ్యవహరించి సజా వుగా నిమజ్జనాన్ని నిర్వహించాల న్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ,డి ఆర్ డి ఎ ,పి డి గాంధీ, డి ఎం అండ్ హెచ్ ఓ ఎం దుర్గారావు ద్వారా ఆర్డబ్ల్యూఎస్ డీఈ పద్మ నాభం తదితరులు పాల్గొన్నారు.

