పోలేకుర్రులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన టిడిపి నేతలు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ లో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి వార్డు పరిధిలోని ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఒకవేళ ఎవరికైనా ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందలేకపోయినట్లైతే దానికి కావలసిన డాక్యుమెంట్లు వివరాలను నాయకులు తెలియజేశారు. ప్రభుత్వం త్వరలో ఇంకా అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరాలు తెలియజేసి అవగాహన కల్పించారు . తల్లికి వందనం పథకంలో అర్హులైన వారందరికీ తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, అర్హులైయుండి పథకంలో భాగంగా ఎకౌంట్లో జమ కాలేని వారికి కావలసిన డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు మండలం ఎస్సీ సెల్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు వడ్లమూరి సతీష్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి సాధనాల వెంకట శివరామకృష్ణ, సాధనాల ప్రసాద్, పోల్నాటి సుభాష్, దున్న సింహాద్రి, జె ఈశ్వరరావు, పంచాయతీ పరిధిలోని సుంకటరేవు నాయకులు, జై భీమ్ పేట కార్యకర్తలు పాల్గొన్నారు.