జిల్లాలో ఎలాంటి జూద క్రీడలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఇటీవల అన్ని పోలీసు శాఖ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిరంతర పరిశీలన కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మంగళవారం జగ్గంపేట సీఐ వై.ఆర్.కె శ్రీనివాస్ కు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, జగ్గంపేట ఎస్‌ఐ రఘునందన్ రావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం సోమవారం గ్రామ శివారులోని గుర్రంపాలెం రోడ్డులో, పోలవరం కెనాల్ వద్ద పేకాట ఆడుతున్నవారిపై ఆకస్మిక దాడి నిర్వహించింది.ఈ దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుండి రూ.10,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది .ఎవరైనా పేకాటలు గుండాటలు మరియు జూద క్రీడలకు పాల్పడినా అదేవిధంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు
జగ్గంపేటలో పేకాట దందాపై పోలీసుల మెరుపుదాడి – ఐదుగురు అరెస్ట్, నగదు స్వాధీనం

జగ్గంపేట
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు
