100 మీటర్ల పరిధిలోని షాపులపై ఆకస్మిక తనిఖీలు
సిగరెట్లు, గుట్కా స్వాధీనం – షాపులకు జరిమానా
సిఐ ఎం శేఖర్ బాబు ఆధ్వర్యంలో దాడులు
రావులపాలెం మండల పరిధిలో మత్తు పదార్థాల విక్రయంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. శేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఉన్న బడ్డి షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా వంటి నిషేధిత పదార్థాలు పలు షాపుల్లో లభ్యమయ్యాయి. వెంటనే ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని, సంబంధిత షాపు యజమానులకు ఫైన్‌లు విధించారు.
పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అలాంటి పదార్థాలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇవి లభిస్తున్నాయని పోలీసులు తెలిపారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల అమ్మకాన్ని నిరోధించేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సిఐ స్పష్టం చేశారు.