క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పీఎంపీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు అన్నారు. పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గొల్లపుంత రోడ్డులో వున్న ఏఎస్‌ఎన్ ఫంక్షన్ హాలులో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం కాలంలో క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగివుండాలని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీల వల్లే ప్రాథమిక వైద్యం అందుతుందన్నారు. రాజమండ్రి డెల్టా హాస్పిటల్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిమ్మలపూడి నితిన్ మాట్లాడుతూ పీఎంపీలు ఎప్పటికప్పుడు అధునాతన వైద్య విధానాలు, శస్త్రచికిత్స విధానాల గురించి అవగాహన పొందాలని సూచించారు. సమావేశంలో పీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ళ రాంబాబు, అసోసియేషన్ నాయకులు బల్లా శ్రీనివాసరావు, సూరంపూడి వీరభద్రరావు, మట్టా వీరబాబు, బల్లా వెంకటరమణ, ఇరవాడ రవి, కొప్పిశెట్టి వెంకటేశ్వర్లు, మేడిశెట్టి రామకృష్ణ, పున్నం రాము, పొన్నాడ శ్రీనివాస్,ఐ ఎస్ ఎల్ ప్రసాద్,ఏడిద లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.