మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చు – సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్
మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చని రాజమండ్రి కి చెందిన సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ లు అన్నారు.బుధవారం పొలమూరు శ్రీనివాసం ఫంక్షన్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) అనపర్తి, బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సు మండల వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సన్ స్టార్ ఆసుపత్రి న్యూరోసర్జన్ డాక్టర్ జమ్ము కోదండరామ్ మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యత పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగష్టు13వ తేదీన అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తున్నారని ఒక వ్యక్తి అవయవ దానం వలన పది మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు.ప్రభుత్వం వారి జీవన్ దాన్ పదకం పై అవగాహన కల్పించారు. అలాగే మెదడుకు వచ్చే రుగ్మతలను ఎలా గుర్తించాలి, ఏవిధమైన ప్రాధమిక వైద్యం అందించాలో వివరించారు. ఎమర్జన్సీ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ఎన్ సుధాకర్ మాట్లాడుతూ మరణించిన వ్యక్తి మూత్రపిండాలు,గుండె,క్లోమం,కళ్ళు, మరియు ఊపిరితిత్తులు వంటి అవయవ దానాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు.ప్రతి ఒక్కరూ అవయవదానం పై అవగాహన కల్పించాలని అన్నారు.గైనకాలజిస్ట్ డాక్టర్ కె భాగ్యప్రీతి గర్భకోశ వ్యాధులపై అవగాహన కల్పించారు.యూరాలజిస్ట్ డాక్టర్ కె హరీష్ కిడ్నీ లో వచ్చే రాళ్ళు గురించి వివరించారు. అలాగే కిడ్నీ దానం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర మీడియా కన్వీనర్, జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పీ చిన్ని, మండల కార్యదర్శి డి సాయి రామారెడ్డి,కోశాధికారి నీలంశెట్టి శ్రీనివాస్,ఎన్ఎస్ చలం,కేఎస్ఎన్ మూర్తి, పి బాలసుబ్రహ్మణ్యం, డీఎమ్ వెంకటపతి రాజు,ఇజ్జు తిరుపతి రావు, సాగి సూర్యనారాయణ రాజు,ఎన్ నరేంద్రరెడ్డి,హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.