కోటి సంతకాల ఉద్యమంలో చైర్ పర్సన్ రాణి…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు.ఆదివారం మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్ కాలనిలో ఆమె ఇంటి ఇంటికి తిరుగుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రవేటికరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందని, పేదలకు నడ్డి విరిచే దిశగా ఫీజుల భారం మోగుతాదని పేర్కొన్నారు.పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాల్టీ సేవలు దూరమయ్యి ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందన్నారు.ప్రభుత్వం ఈ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్ కాలనీ కార్యకర్తలు బత్తిన దొరబాబు, గనిపే నాగ భూషణం,గనిపే ఆనంద్,కాకాడ నూక రాజు,షేక్ మస్తాన్,కొమ్మోజు నాగేశ్వరరావు,కాకాడ సురేంద్ర,పెందుర్తి జాన్, తదితరులు పాల్గొన్నారు

