కూటమి ప్రభుత్వం పేద ప్రజలపై కపట ప్రేమ చూపిస్తుంది…
కోటి సంతకల ప్రజా ఉద్యమంలో ఎమ్మెల్సీ తోట…
మండపేట పట్టణం రూరల్ మండలంలో పాలతోడు గ్రామ సర్పంచ్ పిల్లా అరవ రాజు ఆధ్వర్యంలోను టౌన్ 18వ వార్డులో యర్రగుంట అయ్యప్ప ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల చంద్రబాబు నాయుడు తాబేదారులకు లబ్ధి చేకూర్చి, పేదల చదువు మరియు ఆరోగ్యంపై వెన్నుపోటు పొడవడమేనని తోట గుర్తు చేశారు. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన మెడికల్ కాలేజీలను కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం సమంజసం కాదని తోట తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ వంటి మహమ్మారిని చూసి ప్రజలు భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అవసరమని జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన చేశారన్నారు. ఈ మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు తయారై పేద ప్రజలకు వైద్యం మరింత అందుబాటులో ఉంటుందన్నదే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని తోట తెలిపారు. ఈ కాలేజీలను ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసేందుకు సంతకాల సేకరణ చేపట్టి, ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని గవర్నర్కు తెలియజేయనున్నట్లు ఆయన వివరించారు.రాష్ట్ర బడ్జెట్ సుమారు రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు విడతలవారీగా కొద్ది మొత్తంలో నిధులు ఉపయోగిస్తే మెడికల్ కాలేజీల అభివృద్ధికి దోహదపడవచ్చని తోట సూచించారు. 8వేల కోట్ల ఖర్చుతో ఈ కాలేజీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వానికే ఆస్తిగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుండి వచ్చిన ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్‌కే మంచి పేరు వస్తుందన్న కారణంతో ప్రైవేటీకరణతో కార్పొరేట్ వ్యక్తులకు మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని తోట ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ పట్టణ కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, పాలతోడు సర్పంచ్ పిల్ల అరవరాజు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి వాసిరెడ్డి అర్జున్, గెడ్డం గాంధీ బాబు, కొప్పిరెడ్డి ప్రసాద్, పిల్లా వీరబాబు, తిరుశూల శ్రీను, గ్రంథం సూరిబాబు, తుమ్మ వీరబాబు, ఉండమట్ల ప్రసాద్, కోటేశ్వరరావు, కౌన్సిలర్స్ మెండు బాపిరాజు, జిన్నూరు సాయిబాబు, నియోజకవర్గం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, వీరమల్లి శ్రీనివాసు, పెంకె గంగాధర్, జొన్నపల్లి సత్తిబాబు, కోళ్ళ శ్రీను, శాఖ సత్తిబాబు, తణుకు అశోక్, బిల్లకుర్తి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

