సూపరిపాలనతో ప్రజలంతా మళ్లీ కూటమి పాలనే కోరుతున్నారు…
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం…
ఎమ్మెల్యే వేగుళ్ల…
కూటమి ప్రభుత్వ పాలన దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఇంటి గడప తొక్కిన ప్రజలు అద్భుతంగా ఆదరిస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.బుధవారం కపిలేశ్వరపురం మండలంలో వాకతిప్ప, నాగులచెరువు, కోరుమిల్లి గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఏ గడప తొక్కిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు తో ప్రజలంతా ఆనందంతో ఉన్నారని సుపరిపాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చటం జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం కుంటుపడకుండా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.