సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– నల్లకుంటలో ‘ సుపరిపాలనలో తొలిఅడుగు ‘ కార్యక్రమం
– మాజీ ఎంపీటీసీ ఎన్.ఎస్.ఎన్ చౌదరి ఆధ్వర్యంలో
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని విస్సాపురం పంచాయితీ నల్లకుంట గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఆదివారం విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి , సంక్షేమాన్ని నాయకులు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన , చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను 70 ఇండ్ల ప్రజలకు అందజేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, పారదర్శక పాలన అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరం నాగేష్ , సున్నం రాజారావు , పెనుబల్లి బాలు , కొరస బాలకృష్ణ , కొడియం శ్రీను , తెల్లని జంపన్న , విరమయ్య , తదితరులు పాల్గొన్నారు.