మండపేట పట్టణంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొమ్మిశెట్టి సత్తిబాబు కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా చెక్కును గురువారం రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీమణి వేగుళ్ళ అనిత అందజేశారు. మండపేట పట్టణంలో వారి స్వగృహనికి వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా ఇచ్చారు.అనంతరం కపీలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మెర్ల వీర రాఘవ కుటుంబానికి టేకి గ్రామంలో వారి స్వగృహనికి వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు లక్షల భీమ చెక్కును అందించి వారికి ధైర్యం చెప్పారు. సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లు సుంకర మణికంఠ, వానపల్లి దుర్గాప్రసాద్ లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది జనసేన నాయకులు పాల్గొన్నారు.