కొవ్వూరు స్థానిక మేరకు వీధి వాటర్ ట్యాంక్ వద్ద జి ఎన్ టి రోడ్ జంక్షన్ నందు ఉన్న స్పీడ్ బ్రేకర్లను పునరుద్ధరించాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావుకి నాలుగో వార్డ్ టిడిపి ఇంచార్జ్ బొంత కిషోర్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కి బొంత కిషోర్ వినతిపత్రం ఇచ్చారు. స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా లేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సరి చేయాలని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితంగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

