27 October 2025
Monday, October 27, 2025

పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో అఖిల

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాయవరం హైస్కూల్ లో 219 మందికి ఆశ్రయం

సోమేశ్వరం, మాచవరం కేంద్రాలకు 95 మంది తరలింపు

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

మొంథా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందనే వాతావరణం శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రాణం నష్టం సంభవించకూడదనే ఆలోచనతో ఇచ్చిన ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, పూరిపాకలు,బలహీన గృహాల లో నివాసం ఉంటున్న వారిని, ఇటుక బట్టీ లలో పనిచేసే అంతర్రాష్ట్ర కూలీలను స్థానిక నాయకులతో కలిసి అధికారులు సోమవారం పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమేశ్వరం గ్రామంలో పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారిని రామచంద్రపురం ఆర్డిఓ డి.అఖిల సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రం వద్ద విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జనరేటర్ ఏర్పాటు చేయాలని వివరించారు. బాధితులకు సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వివరించారు. కాగా గ్రామంలో తుఫాను ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి దాసరి సత్యనారాయణ సచివాలయం ఉద్యోగులను సమన్వయం చేసుకోగా, స్థానిక జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శాకా నాగేంద్ర, పార్టీ కార్యదర్శి మణి ప్రసాద్ లతో కలిసి యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులతో మురుగు నీరు సక్రమంగా పారేలా ఏర్పాట్లను సమీక్షించారు. విద్యుత్, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్దంగా ఉన్నారని సోమేశ్వరం,మాచవరం పునరావాస కేంద్రాలలో సుమారుగా 95 మంది ఆశ్రయం పొందుతున్నారని కూటమి నాయకులు శాఖా నాగేంద్ర తెలిపారు.

 

* రాయవరం లో పునరావాస కేంద్రం ఏర్పాటు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను తీవ్రత ప్రభావం చూపనుందనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రమైన రాయవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు సోమవారం 219 మందిని తరలించినట్లు రాయవరం విఆర్వో శైలజ, వి.సావరం విఆర్వో సుబ్బారావు చౌదరి లు తెలిపారు. రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రాయవరం,వి.సావరం గ్రామాలలోని ఇటుక బట్టీ లలో పనిచేసే అంతర్రాష్ట్ర, స్థానిక కూలీలను తరలించారు. ఈ సందర్భంగా విఆర్వో శైలజ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు తో కలిసి అన్ని ఏర్పాట్లు చేసామని త్రాగునీరు వసతులను నిత్యం షిఫ్ట్ ల వైజ్ గా అందుబాటులో ఉంటామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు జనరేటర్ ను ఏర్పాటు చేసామని, వైద్య సౌకర్యాలను సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని పేర్కొంటూ రాయవరం,వి.సావరం గ్రామాల నుండి 105 మంది పురుషులు, 65 మంది స్త్రీలు, 49 మంది పిల్లలు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo