30 November 2025
Sunday, November 30, 2025

పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి ప్రభుత్వ తుఫాన్ ఆసరా అందజేత…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

తుఫాన్ బాధితులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది …

ఎమ్మెల్యే వేగుళ్ల ,ఏపీ ఎస్ ఐ డీసీ చైర్మన్ వేగుళ్ల లీల కృష్ణ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

మొంథా తుఫాన్ కారణంగా మండపేట నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులు అందరికీ ప్రభుత్వం ప్రకటించిన నగదు, నిత్యవసర సరుకులను అందిచటం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన కపిలేశ్వరపురం మండలం, కపిలేశ్వరపురం, వల్లూరు గ్రామాలలోని పునరావాస బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు, నిత్సవసర సరుకులను రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణలు కలసి పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో 1740 మందిని పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగిందన్నారు. వారిలో 476 మందికి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు, 613 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించామన్నారు. అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకించి 651 మందికి 50 కేజీల బియ్యం అందించటమేకాకుండా బియ్యం తో పాటు ఒక లీటరు వంట నూనె, ఒక్కో కేజీ చొప్పున కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ను పంపిణీ చేయటం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo