డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా,రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సంధర్బంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు మంగళవారం గ్రామంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి దర్శనం పొందారు.తొలుత ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఘనస్వాగతం పలికగా, అనంతరం అమ్మ వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, వై.ఆర్.కె.పరమహంస, కనకాల సత్యనారాయణ, జగ్గిన రాజు, గెడా శ్రీనివాసరావు, అంబవరపు సత్యనారాయణ, శాక శ్రీనివాస్, బొల్లి లక్ష్మణ్, నాగదేవర శివ శంకర్, మన్ని నారాయణమూర్తి, శాకా నాగేంద్ర, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

