హాజరైన పట్టణ ప్రముఖులు…
మండపేట పట్టణం కె.పి రోడ్డులో శ్రీ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ ఆరంభ కార్యక్రమానికి పట్టణంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఆత్యాధునిక వైద్య పరికరాలు పరిశీలించి అందించే వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. హాజరైన అతిధులందరికి శ్రీ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఐ ఎన్ వి విశ్వనాథ్, డాక్టర్ ఐ జ్యోతిర్మయిలు దుస్సాల్వ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణ, మాధవి ఆయిల్స్, మాధవి స్పోర్ట్స్ క్లబ్ అధినేత వేగుళ్ళ కృష్ణ చైతన్యబాబు,వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి,టీడీపీ యువనాయకులు,పారిశ్రామికవేత్త వంక కుమార్ బాబు, రెడ్డి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, పలువురు పట్టణ ప్రముఖులు,డాక్టర్లు,పిఎంపీలు,తదితరులు పాల్గొన్నారు.

