Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

రధం గుడి పున:నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

మండపేట పట్టణంలో వేంచేసియున్న శ్రీ జనార్ధన శ్రీ అగస్త్యేశ్వర స్వామి వార్ల దేవస్ధానం (రధం గుడి) పునఃనిర్మాణ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ రధం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవాలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా స్లాబ్ లీకేజీలను అరికట్టడం, శిదిలావస్తుకు చేరిన వాటిని తొలగించడం, వాస్తు మార్పులను చేపడుతారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు రధం గుడికి ప్రతీ రోజు వచ్చే భక్తులతో నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి,మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, వైయస్సార్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారయ్య బాబు,పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేష్, 17వ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని శ్రీనివాస్, మండపేట పిఎసిఎస్ చైర్మన్ కుక్కల రామారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, జొన్నపల్లి సూర్యరావు, శిరంగి ఈశ్వరరావు, చుండ్రు అగస్త్యరాజు, వాకచర్ల గుప్తా, దుగ్గిరాల సోమశేఖర్, వాదా ప్రసాదరావు, కాళ్ళకూరి గోళ్లబాబు, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo