అగ్రి స్టాక్ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా రైతుల గుర్తింపు భూమి రికార్డులు, పంట డేటా మరియు స్కీమ్ ప్రయోజనాలను సమగ్ర పరిచే సాంకేతికత డిజిటల్ వ్యవస్థని ఆధార్ కార్డు మాదిరిగా రైతుల పూర్తి వివరాలతో 11 అంకెల డిజి టల్ నెంబర్ను కేటాయి స్తారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడిం చారు గురువారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ శాఖలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధనం, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అగ్రీ స్టాక్, డిజిటల్ ప్లాట్ఫారం విధి విధానాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సేవలను ఒక త్రాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ పథకాలు డేటా ఆధారిత సాధనాలను ఉపయోగించి వ్యక్తిగతీ కరించిన వ్యవ సాయ సేవలను అందించ డం ఈ డిజిటల్ ప్లాట్ఫారం ప్రధాన లక్ష్య మన్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా భూసార పరీక్షలు ఆధారం గా వాడాల్సిన సూక్ష్మ పోష కాలు ఎరువులు, క్రిమిసం హారక మందులు పంటల దిగుబడి అంశాలను డిజి టల్ సింగిల్ విధాన ప్లాట్ఫా రం ద్వారా సులభతరంగా తెలుసుకొని అనుకరించే వెసులుబాటు కలుగుతుం దన్నారు.అగ్రి స్టాక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రైతులు, కొనుగోలుదారులు, విక్రేతలు, గిడ్డంగులు, ఇతర వ్యవసాయ రంగ భాగస్వా ముల మధ్య వ్యవసాయ ఉత్పత్తులు విత్తనాలు, ఎరువులు, ఇతర లావా దేవీలను సులభంగా పారద ర్శకంగా నిర్వహించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ వ్యవసాయ విధాన మరియు వాణిజ్య వేదిక అన్నారు.రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో విక్రయిం చుకోవచ్చునన్నారు
వ్యవసాయ మార్కెట్ ధరలను ప్రత్యక్షంగా చూసి నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు
పంటలు గిడ్డంగుల్లో ఉన్న స్టాక్ వివరాలు డిజిటల్‌గా నిల్వ చేసుకొన వచ్చున న్నారు.భద్రపరచిన వస్తువుల పరిమాణం, నాణ్యత, నిల్వ కాలం వంటి విషయాలు ట్రాక్ చేయవ చ్చునన్నారు.మార్కెట్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ధరలు ప్రత్యక్షంగా యూనిక్ ప్లాట్ఫారం ద్వారా తెలుసు కొని వచ్చునన్నారు
రైతులు సరైన ధరకు తమ ఉత్పత్తిని అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు.
పేమెంట్ లు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా వేగంగా, సురక్షితంగా జరుగుతా యన్నారు.ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చెల్లింపుల రశీదు పొంద వచ్చునన్నారులాజిస్టిక్స్ & డెలివరీ ట్రాకింగ్,ఉత్పత్తుల రవాణా స్థితిని ట్రాక్ చేయవచ్చునన్నారు.
రైతులకు, కొనుగోలు దారులకు వేగంగా సరుకులు చేరేలా లాజిస్టిక్స్ మెరుగుపరచవచ్చున న్నారు కేవలం రైతుల మొబైల్ నంబర్, ఆధార్ వంటి భూముల విస్తీర్ణం సర్వే నంబర్లు పంటల సాగు వివరాలతో సులభంగా నమోదు చేసుకొని 11 అంకెల డిజిటల్ నెంబర్ను పొందాలన్నారు.స్థానిక భాషలలో మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉంటాయ న్నారు.ఉత్పత్తులను నిల్వ చేసేందుకు నోటిఫైడ్ గిడ్డంగుల సేవలు పొందవచ్చునన్నారు
ధరలలో పారదర్శకత, ఎటువంటి మోసాలు లేకుండా అమ్మకాలు.
పంటల నష్టాలు తగ్గడం ద్వారా ఆదాయం మెరుగు పడుతుందన్నారు.. మండ లాల వారీగా వివరాలు సేకరించి పంపాలని సంబంధిత శాఖ అధికారు లను ఆదేశించారు. వీటన్నింటినీ క్రోడీకరించి సెప్టెంబర్ నెలలో నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి రాష్ట్రస్థాయి నివేదికలను సిద్ధపరచాల్సి ఉంటుంద న్నారు. ఈ అగ్రి స్టాకు డిజిటల్ ప్లాట్ఫారం ఏర్పాటు వల్ల రైతుకు సాగుపరంగా మార్కెట్ పరంగా ఎంతో మేలు చేకూరుతుందని ఆ దిశగా నమోదు చర్యలను వేగవంతం చేసి డిజిటల్ ప్లాట్ ఫారం కొరకు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు
.