వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలో మంగళవారం ఎంజిఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతులకు ఉద్యానవన మొక్కలు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో పంపిణీచేశారు.ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద తాళ్ళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలో రైతు దడాల సింహాద్రమ్మ కు 60 కొబ్బరి మొక్కలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కొబ్బరి తదితర పండ్ల మొక్కలు సాగు చేయాలనుకుంటే ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సంప్రదించి పొందవచ్చు అని ఒక ఎకరానికి 60 మొక్కలు చొప్పున అందచేస్తారని తెలిపారు. అదేవిధంగా మూడు సంవత్సరాలు పాటు ఆ మొక్కలు పరిరక్షణ బాధ్యత ఎంజిఎన్ఆర్జిఎస్ కార్యక్రమం కింద ఇస్తుందని దీనికి కాను ప్రభుత్వం మూడు సంవత్సరాలకి సుమారు 76 వేల రూపాయలు వరకు వెచ్చిస్తుందని అన్నారు. ఉద్యానవన మొక్కలను పెంచే ఆసక్తి కలిగి ఉన్నవారు రైతులు ఎవరైనా సరే ఫీల్డ్ అసిస్టెంట్ ని సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు కూటమి నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి బాబీ, ఉంగరాల వెంకటేశ్వరరావు, పంపన రామకృష్ణ, జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ, వడ్లమూరి సతీష్, వాడ్రేవు వీరబాబు, సాధనాల ప్రసాద్, రాంబాబు, గోవరాజు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.