డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం లో గల రైతుసేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ సహాయకులకు పలు సూచనలు చేసారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రంలో నమోదు చేసేందుకు ప్రభుత్వం వారు మరో అవకాశం కల్పించారని, ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సొంత భూమిలేని కౌలు రైతులకు కనీసం ఒక ఎకరం సాగుదారు పత్రం పొందాలని, పంట నమోదు చేసుకున్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వరిస్తుందని అన్నారు. ప్రతి గ్రామం లోనూ రైతులు పంట నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా ఆగస్టు 15 పంట భీమా కోసం రైతు వాటా చెల్లించేందుకు చివరి తేది అని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు గురించి సర్వే నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ సమావేశంలో తెలిపారు.