డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి జరిమానా : ఎస్సై పి సత్యనారాయణ
కాకినాడ జిల్లా, కాకినాడ పోలీసు సబ్ డివిజన్, కాకినాడ రూరల్ సర్కిల్, కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 11 మందిని కోర్టులో హాజరు వచ్చినట్టు కోరింగ సబ్-ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ వెల్లడించారు. ఈ 11 మందిని కాకినాడ ఫస్ట్ క్లాస్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున ఒక లక్ష పదివేలు రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా కోరంగ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విస్తృతంగా కోరింగ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అతి వేగంగా ప్రయాణించే వాహన చోదకులను అదుపులోకి తీసుకుని భారీ స్థాయిలో జరిమానాలు విధించి.. రహదారి భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు.