మండపేట పట్టణంలో వేంచేసియున్న శ్రీ జనార్ధన శ్రీ అగస్త్యేశ్వర స్వామి వార్ల దేవస్ధానం (రధం గుడి) పునర్ నిర్మాణం పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సోమవారం దేవాదాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇ.ఇ ఉదయ్ కుమార్, డిప్యూటీ సభతి శ్రీనివాసాచారి, ఎ.ఇ కళ్యాణ్, అసిస్టెంట్ సభతి నాగేశ్వరరావు, ఇ.ఒ కామేశ్వరరావు, తదితర్లు పాల్గొన్నారు.