Friday, August 1, 2025
Friday, August 1, 2025

రాబోయే రోజుల్లో కాబోయే వైసిపి ఇన్చార్జ్ నేనే నేనే…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

వైసిపి నేతలకు బుర్ర పనిచేయడం లేదు…

ఎమ్మెల్యే వేగుళ్ల ఆగ్రహం….

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తో సహా ఆ పార్టీ నేతలకు బుర్ర పనిచేయడం లేదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండిపడ్డారు.

టిడిపి కార్యాలయం లో శనివారం ఆయన మాట్లాడుతూ గతంలో తోట ఒక్కరికే బుర్ర లేదని తను అనుకునేవాడినని  వైసిపి సభ అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తో సహా అక్కడికి వెచ్చిసిన నేతలకు బుర్ర పనిచేయడం లేదని విమర్శించారు. గత ఐదేళ్ల లో వైసిపి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తను ఆరోపిస్తే

ఒక్కదానికి సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి వారికి కడుపు మంట గా వుందన్నారు. ముఖ్యం గా సూపర్ సిక్స్ లో నాలుగు హామీలు ఇప్పటికే అమలు చేశామని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన హామీ ఈ నెల లోనే అమలుచేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. తనకు 11 సీట్లే వచ్చాయని దిగాలు పడి జగన్ తమ నాయకులను రోడ్ పైకి పంపుతున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ను బొత్స సత్యనారాయణ విమర్శించడాన్ని తప్పు పట్టారు. 2019 లో జూన్ నెల లో అన్నా క్యాంటీన్ ల పై తాము ప్రశ్నిస్తే  గత ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని తాము మరింత సమర్థవంతం అన్న క్యాంటీన్ లు నిర్వహిస్తామని చెప్పిన బొత్సా మూడు రోజులు తిరక్కుండానే అన్న క్యాంటీన్ లను రద్దు చేసిన ఘనత ఆయనదని విమర్శించారు.పేదవాడు ఆకలి తో ఉంటేనే జగన్ కు సంతృప్తి అని అందుకు పేద వారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లు ఎత్తి వేశారని ఆరోపించారు. ప్యాలెస్ లో ఉండటమే తప్ప పేద వారికి చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. మండపేట లో వైసిపి ఇన్ ఛార్జ్ కోసం పోటీ తప్పితే ప్రజలకు మేలు చేసే ఆలోచన వారికి లేదన్నారు. ఇన్ ఛార్జ్ కోసం మా ఇంటి కి రండి అంటూ వర్గ విభేదాలు బయట పడ్డాయన్నారు. గతంలో మండపేట లో వైసిపి పరిపాలన ఏ రకం గా జరిగిందో అందరూ చూస్తున్నారు. రాక్షసులు రాక్షస రాజ్యం వైసిపిదే నని మండిపడ్డారు. పవిత్రమైన స్కూల్ ను స్వాధీనం చేసుకొని మద్యం మాంసం తో అక్కడ రౌడీ మూకలు తో విద్యార్థులు జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారో నియోజక వర్గ ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. ఇపుడు రామరాజ్యం గా చక్కగా ఉంటే రాక్షస రాజ్యం అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ పథకం లో కేవలం 254 మంది కి మాత్రమే రాలేదని నియోజక వర్గ వ్యాప్తంగా 80, 490  మందికి గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా ఇచ్చామన్నారు. 230 మంది మండపేట ఇండియన్ గ్యాస్ కంపెనీ లో రాలేదని మిగిలినవి మూడు మండలాల్లో ఉన్నాయని వీరందరికీ గ్యాస్ సిలిండర్ సొమ్ములు పడితే వంద శాతం ఇచ్చినట్లు అవుతుందని వివరాలు వెల్లడించారు. పార్టీ కులం మతం అని చూడకుండా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక నైనా తప్పుడు మాటలు మానుకొని అమలు కాని పథకాలు కోసం మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. కళ్ళు ఉండి  కాబోదుల్లా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. పింఛన్ లు సొమ్ము పెంచి పింఛను తొలగించారని ఆరోపిస్తున్నారని మండపేట నియోజక వర్గంలో అర్హులైన ఒక్కరి పింఛను రద్దు చేసినట్లు రుజువు చేయాలని సవాల్ చేశారు. ఈ సమావేశం లో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, నల్లమిల్లీ వీరెడ్డి, రెడ్డి ప్రసాద్, పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo