14 October 2025
Tuesday, October 14, 2025

రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఆర్డీవో రాణి సుస్మిత

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించిన కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు డివిజన్ పరిధిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు – ఆర్డీవో రాణి సుస్మిత

 

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

తూర్పుగోదావరి జిల్లా లో రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. మంగళవారం, బుధవారం, గురువారం మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్న నేపథ్యంలో మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను ఆర్డిఓ రాణి సుస్మిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ 3 రోజులు పాటు భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నదిలో ఎవరు స్నానానికి దిగరాదని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికే ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు రిలీఫ్ క్యాంపులకు చేరుకోవాలని కోరారు. రిలీఫ్ క్యాంపు లలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో డి దుర్గాప్రసాద్ , మున్సిపల్ సానిటరీ మేస్త్రి రాజన్న అప్పారావు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo