డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోని పసలపూడి, చెల్లూరు పరిసర గ్రామాలకు జూలై 25వ తేదీ శుక్రవారం ఉదయం 08:00 గం! నుండి మధ్యాహ్నం 01:00 గం!ల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని, రామచంద్రపురం ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు, చెట్లుకొమ్మలు తొలగించడం, పసలపూడి సబ్ స్టేషన్ పరిధిలో పసలపూడి రూరల్ ఫీడర్, పసలపూడి ఇండస్ట్రీయల్ ఫీడర్, పసలపూడి టౌన్ ఫీడర్,ల మరమ్మత్తులు,మెయింటనెన్స్ నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన ప్రకటన ద్వారా కోరారు.