జగ్గంపేట మండలం రాజపూడి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జగ్గంపేట సీడీపీఓ ఎం. పూర్ణిమ ఆధ్వర్యంలో పోషకహర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ విష్ణు మారుతి మాట్లాడుతూ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లితో అనుబంధం ఏర్పడుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భ దశ నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకూ పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నాం. బాలింతలు, గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. చిరుధాన్యాలు, ఆకుకూరలు, మునగాకు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి అని సూచించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు తల్లులకు అవగాహన కల్పించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా తల్లులు ఇంటివద్ద తయారు చేసిన పిండి వంటకాలను తీసుకువచ్చారు. వాటిలో ఉత్తమమైన మూడు వంటకాలను ఎంపిక చేసి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఒక గర్భిణీకి శ్రీమంతం నిర్వహించారు. మొదటి మెట్టు అంగన్వాడి కేంద్రం నుండే చిన్నారుల అభ్యాసం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరసింహామూర్తి, సూపర్వైజర్ అమ్మాజీ ,ఎ ఎన్ మ్ ఆశావర్కర్లు, అంగన్వాడి టీచర్లు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.