14 October 2025
Tuesday, October 14, 2025

రాజీమార్గమే రాజమార్గం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక – 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనూరాధ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది సభ్యునిగా  వై.చలపతి .వ్యవ హిరించారు. సివిల్ కేసులపరిస్కర నిమిత్తం ఏర్పాటు చేసిన 2వ బెంచ్ కు సీనియర్ సివిల్ జడ్జి జి. వి .ఎల్ .సరస్వతి .న్యా య వాది సభ్యుని గా ఎం .గోపి,సివిల్ మరియు క్రిమినల్ కేసులనిమిత్తం ఏర్పాటు చేసిన 3 వ బెంచ్ కు  కే .నాగ లక్ష్మి .న్యా య వాది సభ్యుని గా కే .బ్రహ్మ య్య వ్యహరించారు. ఈ సందర్భంగా తొమ్మిదో వాదనపు జిల్లా జడ్జ్ ఎం అనురాధ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు, దీని ద్వారా సమయం డబ్బు వృధా కాదని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరువర్గాలు రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకొని ప్రశాంతవంతమైన జీవనాన్ని పొందాలన్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్ లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కి సంబంధించిన నాలుగు కేసులను పరిష్కరించుకోవడం జరిగిందని, మూడు కేసులకు సంబంధించి 87 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని బాధితులకు అందించడం జరిగిందని, నష్టపరిహారాన్ని పొందే సభ్యులు కోర్టు వరకు రాలేకపోవడంతో వారి వద్దకే వెళ్లి చెక్కులను అందించడం జరిగిందన్నారు. ప్రజలందరూ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ న్యా య వాదులు పోలీస్ లు కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo