చోడే శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు…
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడు చోడే శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ మంగళవారం రామచంద్రపురంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి శ్రీకృష్ణ నేతృత్వంలో మండపేట నుంచి పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. తొలుత మండపేటలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని మహానేతకు నివాళులర్పించిన అనంతరం వీరంతా రామచంద్రపురం తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలే ప్రాణంగా పేదల అభ్యున్నతికి దివంగత వైఎస్‌ఆర్ చేసిన కృషి, పేదల పట్ల ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిలో నిలిచిపోయాయని అన్నారు అనంతరం రక్తదానం ప్రాధాన్యత గురించి శ్రీకృష్ణ వివరించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన శ్రీకృష్ణను సూర్యప్రకాష్ అభినందించారు.