రాకుర్తి వారి పాలెం సొసైటీ అధ్యక్షులుగా బొక్కా వెంకట కుమార్*
కొత్తపేట జులై 26.విశ్వం వాయిస్ న్యూస్. కొత్తపేట రాకుర్తివారి పాలెం కొత్తపేట మండలం మోడెకూరు పంచాయతీ పరిధిలోని రాకుర్తి వారి పాలెం సొసైటీ అధ్యక్షులుగా బొక్కా వెంకట కుమార్ రాకూర్తివారి పాలెం సొసైటీ కార్యాలయం వద్ద బాధ్యతలు స్వీకరించారు.
గతంలో గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బొక్క వెంకట కుమార్ గత పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.బొక్క వెంకట కుమార్ పై ఉన్న సానుకూలత భావంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుమార్ ను సొసైటీ అధ్యక్షులుగా ఎంపిక చేశారు.గొలకోటి సూర్యనారాయణ (ఏసు) గన్నవరపు చిన్న జోజి లను సొసైటీ డైరెక్ట్ లగా నియమించారు.ఎమ్మెల్యే సత్యానందరావు ఆశీస్సులతో సొసైటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వెంకట్ కుమార్ కు కొత్తపేట మండలం నాయకులు ముత్యాల బాబ్జి కంఠంశెట్టి శ్రీనివాస్ ధర్నాల రామకృష్ణ రెడ్డి రామకృష్ణ పల్లి ఏసు రెడ్డి శ్రీనివాస్ యల్లమెల్లి జగన్మోహన్ రెడ్డి తాతాజీ బూసి భాస్కరరావు గుబ్బల మూర్తి సరిపెల్ల రాజబాబు గొలకోటి సత్తిబాబు హోతా రాము చిలకలపూడి సుబ్రహ్మణ్యం ఎలమంచిలి వెంకటేశ్వరరావు కోటిపల్లి వెంకట్రావు మైగపుల అమ్మిరాజు చిట్టూరి ఆదినారాయణ కముజు తాతాజీ టి.సీతారామరాజు తదితర గ్రామ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

