14 October 2025
Tuesday, October 14, 2025

రామచంద్రపురం గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రామచంద్రపురం గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి

గొల్లపాలెంలో విద్యార్థుల భారీ ప్రదర్శన

సంఘీభావం తెలిపిన నాయకులు

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, కాజులూరు

రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో కాజులూరు జంక్షన్ నుండి మార్కెట్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ జెఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల కరెస్పాండంట్ చెల్లుబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, స్థానిక సర్పంచ్ పోతురాజు ప్రసన్నమౌనిక, బాబురావు, సొసైటీ అద్యక్షులు తోట కృష్ణ, బీజేపీ నాయకులు పోతుల వీరబాబు తదితర నాయకులు ర్యాలీకి మద్దతు పలికారు. ఇప్పటికే కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చిన సందర్భంలో త్వరలోనే రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ కాజులూరు మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు. వడ్డే చిన్న వీరబాబు, పెట్టా కృష్ణ మూర్తి, అంగర శ్రీను గౌడ్, మైనార్టీ నాయకులు ఎంఆర్ షాజహాన్ పీడీఎస్ యూ నాయకులు వానపల్లి నాగరాజు, కరుపోతు నవీన్ , బల్ల ఈశ్వరరావు, మాధురి స్వీట్ స్టాల్ దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo