14 October 2025
Tuesday, October 14, 2025

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు

 

 

ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా

 

అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ

 

రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఏ.సీ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటలకు రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ప్రారంభమైన ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాగా మారింది.ప్రజల న్యాయమైన డిమాండ్ అయిన కాకినాడ జిల్లాలో విలీనం కోసం నాయకులు గళమెత్తారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ, గౌరవ అధ్యక్షులు గరికిపాటి సూర్యనారాయణ, ఉండవిల్లి గోపాల్ రావు, గాధంశెట్టి శ్రీధర్,గొల్లపల్లి కృష్ణ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు,ఉద్యోగ సంఘాల (జెఏసీ) అధ్యక్షులు ఎం.వేంకటేశ్వర రావు,విఆర్ఓ సంఘాల అధ్యక్షులు మద్దాల బాపూజీ తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి దాదాపు 60 కి.మీ. దూరంలో ఉండడం వల్ల ప్రజలు రోజూ పరిపాలనా పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరదలు, తుఫానులు వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగిపోవడం, రహదారులు మునిగిపోవడం,రవాణా ఆగిపోవడం వలన ప్రజలు అత్యవసర అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రులకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు తమ చదువుల కోసంసతమతమవుతున్నారు.మరోవైపు కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం 25 కి.మీ. దూరంలో ఉంది.అక్కడే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి,ఆధునిక వైద్య సదుపాయాలు, విశ్వవిద్యాలయం, కళాశాలలు, ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. రామచంద్రపురం కాకినాడ జిల్లాలో చేర్చితే వైద్యం, విద్య,ఉపాధి,పరిపాలన అన్నీ ప్రజలకు సులభతరం అవుతాయి.

 

గతంలో పునర్విభజనలో రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే ప్రతిపాదన ఉన్నా అమలు కాలేదు.2022–23లో జరిగిన జిల్లాల విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ప్రజలపై చేసిన ఘోర అన్యాయం అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సబ్ కమిటీలో ఈసారి తప్పకుండా రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని జె.ఏ.సీ గట్టిగా డిమాండ్ చేస్తుందని అన్నారు.

 

రామచంద్రపురం నియోజకవర్గ జేఏసీ ప్రతినిధులు రామచంద్రపురం ఆర్.డీ.ఓ అఖిల ప్రియ వారికి వినతి పత్రం అందజేశారు, రామచంద్రపురం మండల పరిషత్ ఎంపీపీ అధ్యక్షరాలు అంబటి భవాని వారికి వినతి పత్రాలు అందిస్తూ మండల పరిషత్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలని, చాలా గ్రామాలు నియోజకవర్గానికి అనుకూలంగా తీర్మానం చేశారని,ఇంకా ఉన్న గ్రామాలు కూడా తీర్మానం చేయించాలని ఆమెను కోరారు.ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సీనియర్ న్యాయవాదులు గాలింకి చిట్టిబాబు,దొమ్మలపాటి సత్యనారాయణ,సిపిఐ నాయకులు శారద, పీ.వై.ఎల్ నాయకులు అంబటి కృష్ణ,టిడిపి పట్టణ నాయకులు కె.బాబూరావు, ఎన్.బలరాం,నాయుడు మాస్టర్,టీ.ఎస్. ఆర్.పీ.వర్మ (వాసు,) రామచంద్రపురం కౌన్సిలర్ అంకం శ్రీను,పి.మధు, జనసేన పట్న నాయకులు బుంగ రాజు,నల్లా వెంకటేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్టర్ నంద, ఖాన్,కోట శ్రీను,బీజేపీ నాయకులు కె.హరిబాబు, ముస్లిం మైనార్టీ నాయకులు హమ్మద్, జర్నలిస్టు వెంకట రమణ, ఎస్సీ,ఎస్.టీ ఫెడరేషన్ నాయకులు ఎం.ప్రభాకర్, కార్మిక నాయకులు రాజు జనసేన నాయకులు నల్లా సుధాకర్,నున్న చిట్టిబాబు,సయ్యద్ ఫజల్,చిన్న కాపు,కాజులూరు మండల నాయకులు డేగల నాగేంద్ర,ఆకుల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo