మండపేట పట్టణం 27,28వ వార్డు లో చేపట్టిన సి.సి రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధులు రూ.35 లక్షలతో సి.సి రోడ్డు సిసి డ్రైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఇ శ్రీనివాస్,కౌన్సిలర్లు నీలం దుర్గ, మొండి భవాని తదితరులు పాల్గొన్నారు.

