రోటరీ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-సమాజానికి సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి సత్యం పేర్కొన్నారు.ఆదివారం అన్నయిపేట గ్రామంలో కాకినాడ రోటరీ క్లబ్ సౌజన్యంతో అన్నయపేట పంచాయతీ నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ (జల కళ్యాణం) ప్రారంభోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ పెమ్మిరెడ్డి దొరబాబు,ముఖ్య అతిథులుగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, రోటరీ అధ్యక్షులు తడాలబుజ్జి రోటరీ సెక్రెటరీ సతీష్ లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో సత్యం మాట్లాడుతూ గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన రోటరీ క్లబ్ సేవలను అభినందించారు.వాటర్ ప్లాంట్ నిర్మాణంతో సురక్షితమైన నీటిని పొందటం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం వైస్ ఎంపీపీ శాఖ బాబి,ఉప సర్పంచ్ చల్లా బుజ్జి గ్రామ పెద్దలు రావూరి సుబ్బారావు,పెమ్మిరెడ్డి మురళి,ఆకేటి భీమన్న, అన్నయిపేట గ్రామపంచాయతీ పాలక సభ్యులు రోటరీ క్లబ్ కాకినాడ పాలక సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ దొరబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ కూడా ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నామని ప్రజలందరూ కూడా ఈ మంచినీరును సద్వినియోగపరచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి భాగస్వామిగా సహకరించిన రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ, విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు.