వైయస్ఆర్ క్వాలని టిడ్కో అపార్ట్మెంట్ వద్ద గల అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆశ్రయించే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూకదుర్గారాణి సూచించారు. గురువారం అక్కడ నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ఆమె పాల్గొని ఆసుపత్రి పరిస్థితులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్‌లో ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మెడికల్ ఆఫీసర్ వి భవాని, స్టాఫ్ నర్స్ సౌధామిని, హాస్పిటల్ సిబ్బంది దేవిక, గణేష్, నగేష్, కళ్యాణి, ధనబాబు తదితరులు పాల్గొన్నారు