ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని మండపేట రూరల్ సిఐ పి దొర రాజు అన్నారు. మండపేట మండలం ద్వారపూడి లో శనివారం ఆటో డ్రైవర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ప్రదిప్తి పాల్గొన్నారు. రూరల్ ఎస్ ఐ వి కిషోర్ మాట్లాడుతూ నియమ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయరాదని, యూనిఫారం తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు ఆటో లో ప్రయాణిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.