వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మండపేట ప్రతినిధులు…
పోతుల దుర్గాప్రసాద్…
అబ్బిరెడ్డి వీర్రాజు…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మండపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి పోతుల వీర వెంకట సత్య దుర్గాప్రసాద్ మరియు నియోజకవర్గం విద్యార్థి విభాగం కన్వీనర్ అబ్బిరెడ్డి వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగం నాయకుల్ని ఉద్దేశిస్తూ రానున్న దేశ రాజకీయాల్లో యువత మరియు విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తారని అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు గురించి విద్యార్థి నాయకులకి వివరించారు, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టి విధంగా వైఎస్ఆర్సిపి హయాంలో మెడికల్ కాలేజీలు తీసుకువస్తే నేడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం అని అన్నారు. దీనికోసం విద్యార్థి విభాగం నాయకులందరూ కలిసికట్టుగా పోరాడాలని వైఎస్ జగన్ విద్యార్థి విభాగం నాయకులకి సూచనలు చేశారు. మీరు విద్యార్ధుల కోసం చేసే న్యాయమైన పోరాటాలు నా దృష్టిలో ఉన్నాయని ప్రతి నియోజకవర్గం నుండి 2029 లో కొంతమంది 2034 లో కొంతమంది చట్ట సభలలో ప్రజాప్రతినిధులుగా మీరు ఉండే అవకాశాన్ని కల్పిస్తానని మీరంతా నా గుండెల్లో ఉన్నారన్నారు. సమావేశానంతరం అబ్బిరెడ్డి వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తో కలిసి వైయస్.జగన్ ను గౌరవప్రదంగా కలసి దుశ్శాలువాతో సత్కరించి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు

